శ్రీముఖి వల్లే యాంకర్‌గా కొనసాగుతున్నా: బుల్లి తెర యాంకర్ రవి
- October 19, 2017బుల్లి తెర యాంకర్ రవి ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ ఆడయో ఫంక్షన్ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రవి సూపర్ అంటూ మద్దతు తెలపడం ఈ వివాదానికి కారణమైంది. పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మహిళా సంఘాలు వారిద్దరిపై కేసులు కూడా నమోదు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వంగా చేసినవి కావని రవి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. ఆ సమయంలో ఇంట్లో వారితో పాటు, ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న వేసేవారని దీంతో యాంకరింగ్ నించి విరమించుకోవాలనుకున్నానని రవి చెప్పాడు. అయితే ఆ సమయంలో తోటి యాంకర్లు శ్రీముఖి, సుమ, ప్రదీప్ అండగా నిలిచారని, మేం కూడా ఇలాంటివి ఎదుర్కున్నామని అంత మాత్రం చేత యాంకేరింగ్ నించి విరమించుకోవద్దని ధైర్యం చెప్పారన్నారు. ఆ సమయంలో శ్రీముఖి ఇచ్చిన సపోర్ట్ నన్ను మళ్లీ మీ ముందు యాంకర్‌గా నిలబెట్టిందని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు