కాలుష్యంలో ఇండియానే టాప్..
- October 20, 2017
ఇండియాలో కాలుష్యం పెరిగిపోతున్నది. ఒక్క 2015లోనే కాలుష్య సంబంధిత రోగాల కారణంగా ఇండియాలో 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో ప్రపంచంలోనే ఇండియా తొలి స్థానంలో ఉంది. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. 2015లో ఎయిడ్స్, టీబీ, మలేరియా రోగాల వల్ల చనిపోయిన వారి కంటే కాలుష్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అందులోనూ వాయు కాలుష్యం వల్లే 18 లక్షల మంది చనిపోయారు. ఇందులోనూ ఇండియానే టాప్. అదే ఏడాది నీటి కాలుష్యం వల్ల మరో 6.4 లక్షల మంది చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో 70 శాతం మరణాలు, గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధుల వల్లేనని ఈ అధ్యయనం తేల్చింది. ప్రతి దేశంలోనూ కాలుష్యం బారిన పడి ఎక్కువగా చనిపోతున్నది బలహీన వర్గాలే. ద లాన్సెట్ అనే సంస్థ ఈ స్టడీ నిర్వహించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల చనిపోయిన వారిలో 50 శాతానికిపైగా ఇండియా, చైనా వాళ్లేనని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. ఇక ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగి మెడికల్ ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి.
ప్రపంచంలోని పది మంచి పేరున్న దేశాలను చూస్తే కాలుష్యం కారణంగా ఎక్కువగా చనిపోతున్న వారు ఇండియా, బంగ్లాదేశ్లలోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలు 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని కూడా ఈ స్టడీ తేల్చింది. అంటే 2050లో ఈ మరణాలు 42 లక్షల నుంచి 66 లక్షలకు చేరే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇండియా ఉన్న దక్షిణాసియా, తూర్పు ఆసియా నగరాల్లో కాలుష్యం వేగంగా పెరగనుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య 16 శాతం పెరగగా.. అందులో ఇండియాలాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే 92 శాతం మరణాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







