బిఐసి నేషనల్ డే ఫెస్టివల్‌కి ఏర్పాట్లు షురూ
- October 20, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి), బిఐసి నేషనల్ డే ఫెస్టివల్ కోసం ఏర్పాట్లు షురూ చేసింది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సహకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 14 నుంచి 17 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. సఖిర్‌లో 'ది హోమ్ ఆఫ్ మోటర్ స్పోర్ట్ - మిడిల్ ఈస్ట్'లో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్‌లోనే అతి పెద్ద ఫెస్టివల్‌గా ఇది నిర్వహించబడ్తుంది. వరుసగా ఐదో ఏడాది ఈ ఫెస్టివల్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు బిఐసి వర్గాలు వెల్లడించాయి. షాపింగ్ ఎక్స్‌పీరియన్స్, కార్పొరేట్ ఎగ్జిబిషన్ స్పేస్, చిల్డ్రన్స్ యాక్టివిటీస్ మరియు ప్లే ఏరియా, కల్చరల్ మరియు మ్యూజికల్ పెర్ఫామెన్సెస్, ఫుడ్ మరియు బెవరేజ్ ఔట్‌లెట్స్, స్థానిక కళాకారులతో కాన్సెర్ట్స్ వంటివి ఇక్కడ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







