యువకుడి హత్య, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు
- October 20, 2017
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు విధించింది. ఓ యువకుడ్ని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధించడం జరిగింది. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో యువకుడ్ని ఈ ఇద్దరూ చిత్రవధ చేశారు. బాధితుడ్ని సయ్యెద్ అహ్మద్ సయెద్ మోసాగా గుర్తించారు. షకురా విలేజ్ నుంచి ఇతన్ని కిడ్నాప్ చేసిన నిందితులు, పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో తీవ్రంగా హింసించారు. ఆ హింసను తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు బాధితుడు. అతన్ని ఆ స్థితిలో గుర్తించిన పోలీసులు, సలమానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించారు. సోషల్ మీడియాలో అతని ఫొటోని చూసి, బాధితుడి తండ్రి అతన్ని గుర్తించడం జరిగింది. విచారణలో బాధితుడి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఈ ఘటనలో దోషిగా తేలడంతో ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







