27 కిలోల గోల్డ్‌ జ్యుయెలరీ స్వాధీనం

- October 20, 2017 , by Maagulf
27 కిలోల గోల్డ్‌ జ్యుయెలరీ స్వాధీనం

అబుదాబీ పోలీసులు 27 కిలోల బంగారు ఆభరణాల్ని సీజ్‌ చేశారు. అబుదాబీలోని కమర్షియల్‌ మార్కెట్‌లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 స్టోర్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, ఈ కమర్షియల్‌ ఫ్రాడ్‌ బయటపడింది. వీటిల్లో 11 షాపులు ఒకరికే చెందినవి. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ రషీద్‌ మొహమ్మద్‌ బోర్షిద్‌ మాట్లాడుతూ, వుడెన్‌ షెల్వ్‌లలో దాచి ఉంచిన బంగారు నగల్ని ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయని చెప్పారు. తనిఖీల నేపథ్యంలో కొందరిని విచారించామనీ, తదుపరి విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగిందని ఆయన వివరించారు. వినియోగదారులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అక్రమ అమ్మకాలపై ఏ చిన్న సమాచారం ఉన్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అక్రమ మార్గాల్లో అమ్మకాల ద్వారా, అక్రమార్జనకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని బ్రిగేడియర్‌ బోర్షిద్‌ హెచ్చరించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com