మరోసారి రిలీజ్ డేట్ మారిన ఆక్సిజన్ మూవీ
- October 21, 2017
గోపీచంద్ కెరియర్ ప్రస్తుతం ఏ మాత్రం బాగులేదు..చేసిన సినిమాలు వరుసపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవుతుంటే , షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు మాత్రం పలు వాయిదాలతో రిలీజ్ డేట్స్ మారుస్తూ ముందుకు సాగుతున్నాయి. ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని నెలలు గడుస్తున్నా రిలీజ్ కు మాత్రం నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఆక్సిజన్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్. గతం లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించినప్పటికీ , ఇప్పుడు ఆ డేట్ ను మార్చారు. తాజాగా నవంబర్ 10 న సినిమా థియేటర్స్ లోకి వస్తుందని తెలిపారు. మరోపక్క అక్టోబర్ 23న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు, ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిధిగా వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ చాల రోజుల క్రితమే అన్ని పనుల్ని పూర్తి చేసుకున్నా ఏవో కారణాల వలన విడుదల వాయిదాపడుతూ వచ్చింది. అందుకే ఇకపై ఆలస్యం చేయకూడదని భావించిన చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. మరి ఈ సినేమైనా గోపీచంద్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







