అఖిల్ నటిస్తున్న'హలో' తాజా అప్ డేట్
- October 20, 2017తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు నాగచైతన్య, సమంత పెళ్లి పనులతో బ్రేక్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవటంతో హాలో టీం తిరిగి షూటింగ్ మొదలు పెట్టేసింది.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కన్ఫామ్ చేసిన హీరో అఖిల్, హలో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించనున్నాం డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుందంటూ తెలిపారు. అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!