బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారో.. అంతే.. చైనా ఘాటు హెచ్చరిక
- October 21, 2017
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను విదేశీ నాయకులు ఎవరైనా కలిస్తే.. దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ చైనా శనివారం ఘాటు హెచ్చరికలు జారీచేసింది. టిబేట్ మతనాయకుడైన దలైలామాను 'వేర్పాటువాద' నేతగా భావిస్తున్న చైనా.. ఆయనకు ఏ దేశమైన ఆతిథ్యమిచ్చినా, విదేశీ నాయకుడు ఎవరైనా ఆయనను కలిసినా సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విదేశీ నేతలు ఎవరైనా వ్యక్తిగతంగా దలైలామాను కలుసుకోవచ్చునని భావిస్తూ ఉండవచ్చునని, కానీ, తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అలా చేయరాదని చెప్పుకొచ్చింది.
1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దలైలామా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. నోబెల్ శాంతిపురస్కారాన్ని గెలుచుకున్న దలైలామాను చైనా ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణిస్తూ వస్తోంది. మరోవైపు దలైలామా తన హిమాలయ మాతృభూమి అయిన టిబేట్‌కు సముచితమైన స్వతంత్ర ప్రాతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
దలైలామాను ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కలిస్తే.. అది చైనా ప్రజల సెంటిమెంట్‌కు విరుద్ధమైన తీవ్ర నేరమే' అంటూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ మినిష్టర్ ఝాంగ్ యిజియాంగ్ అన్నారు. గతంలో ప్రపంచ నేతలు ఎవరైనా దలైలామాను కలిస్తే.. చైనా నిరసన తెలిపిదే. కానీ, తాజాగా దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







