ఉత్తర్‌ప్రదేశ్‌లో హిందీ వార్తా పత్రికకు చెందిన జర్నలిస్ట్ హత్య
- October 21, 2017
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చేటుచేసుకుంది. ప్రముఖ హిందీ వార్తా పత్రికకు చెందిన రాజేశ్ మిశ్రా(38) అనే విలేకరి ఘాజీపూర్ జిల్లాలో దారుణహత్యకు గురయ్యారు. మిశ్రా కుటుంబం భవన నిర్మాణ సామాగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం దుకాణం వద్ద నిల్చుని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చారు. దీంతో మిశ్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్ మిశ్రా ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నారు.
కాల్పుల శబ్దం విన్న మిశ్రా సోదరుడు అమితాబ్ మిశ్రా దుకాణం నుంచి బయటకు రాగా దుండగులు అతడిపైనా కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఘాజీపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతోవారణాసికి తరలించారు.
రాజేశ్ మిశ్రా హత్యకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని శాంతిభద్రతల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆనంద్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని, 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







