పాక్ లో చైనా రాయబారిని చంపేందుకు కుట్ర
- October 22, 2017
పాక్ ఆత్మబంధువుగా పేరున్న చైనా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లో నియమించిన చైనా రాయబారిని హతమార్చేందుకు ఓ ఉగ్రబృందం సిద్ధమైంది. చైనాలోని జిన్జియంగ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామిక్ ఉగ్రసంస్థకు కొందరు ముష్కరులు పాకిస్థాన్‌లో ప్రవేశించారు. వీరు తమ రాయబారి కోసమే పాక్‌లోకి వచ్చినట్లు చైనా అనుమానిస్తోంది. వెంటనే తమ రాయబారి, చైనా సిబ్బంది, చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌లో పనిచేసే చైనీయులకు భద్రత కల్పించాలని పాక్‌కు లేఖ రాసింది. ఈ లేఖతోపాటు అబ్దుల్ వాలి అనే ఒక ఉగ్రవాది పాస్‌పోర్టు వివరాలను కూడా పాక్‌కు అందజేసింది. ఈ లేఖను పాకిస్థాన్ స్థానిక మీడియా సంస్థ ఒకటి ప్రచురించింది. ఇటీవలే పాకిస్థాన్‌లో చైనా కొత్త రాయబారిని నియమించింది. అప్పటి వరకు అక్కడ పనిచేసిన సన్ వైడాంగ్ను చైనాకు రప్పించి..ఆఫ్గనిస్థాన్‌లో రాయబారిగా పనిచేస్తున్న యో జింగ్ను పాకిస్థాన్‌లో నియమించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







