భార్య ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ దీన్ని ఒక ముక్క తినిపించాలి...
- October 22, 2017
బంగారు రంగుతో చూడటానికి అందంగా, తియ్యగా, మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా మందులలో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. తాటి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదార లాగా పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల నుంచి 350 గ్రాముల శక్తిని, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 55 గ్రాముల కాల్షియం, 40 గ్రాముల పాస్పరస్, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్ బెల్లంలో దొరుకుతుంది.
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. తియ్యటి పదార్థాలకు చక్కెర కన్నా బెల్లం మేలు. రోజూ బెల్లం ముక్క తినే వారిలో రక్తశుద్ధి జరిగి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణసంబంధింత సమస్యలు రాకుండా చూస్తుంది.
బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడుతాయి. బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్, ఫ్లోరిక్ యాసిడ్‌లు మహిళల్లో రక్తహీనతను నివారిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండి జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







