అవియల్
- October 22, 2017
కావాల్సిన పదార్థాలు: క్యారెట్ - 200 గ్రాములు, బీన్స్ - 250 గ్రాములు, తెల్ల గుమ్మడికాయ - 250 గ్రాములు, అరటికాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - పది, పొట్లకాయ - 250 గ్రాములు, మునగకాయలు - మూడు, అల్లం - కొద్దిగా, కరివేపాకు - రెండు రెబ్బలు, కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, పెరుగు - 500 గ్రాములు, జీలకర్ర - పది గ్రాములు, కొబ్బరినూనె -100 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: కూరగాయలంటినీ వేలు సైజులో కోసుకోవాలి. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. పదినిమిషాల తర్వాత వాటిని ఉడికించి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, నాలుగు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో కొబ్బరి నూనె వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక, కొబ్బరి ముద్ద వేసి, అదీ వేగాక కూరగాయ ముక్కలు వేయాలి. చివర్లో కొద్దిగా పెరుగు వేసి ఉడికించుకోవాలి. దీన్నే అవియల్ అంటారు. దీనిని అన్నంలో ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







