రోహింగ్యాలకు రూ.260 కోట్ల ఆర్థికసాయం చేసిన అమెరికా

- October 23, 2017 , by Maagulf
రోహింగ్యాలకు రూ.260 కోట్ల ఆర్థికసాయం చేసిన అమెరికా

దినదిన గండంగా శరణార్థి శిబిరాల్లో బతుకు వెళ్లదీస్తున్న రోహింగ్యా ముస్లింపై ట్రంప్‌ సర్కార్‌ కరుణ చూపించింది. తాజాగా మరో రూ.260 కోట్ల అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో రోహింగ్యాల శ్రేయస్సుకు ఇప్పటివరకు ప్రకటించిన ఆర్థిక సాయం రూ.675 కోట్లకు చేరింది. ఐరాస అనుబంధ సంస్థలు యూనిసెఫ్‌, శరణార్థి, వలసల నివారణ సంస్థలకు అమెరికా ఈ మొత్తాన్ని అందజేసింది. రోహింగ్యా ముస్లింలకు ఆవాసం, ఆహారం, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంతర్జాతీయ సంస్థలు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నాయి. మయన్మార్‌లో సైనికుల దురాగతాలను నుంచి తప్పించుకుంటూ సరిహద్దులు దాటుకుని వచ్చిన రోహింగ్యాలకు అండగా నిలిచిన బంగ్లాదేశ్‌ సర్కార్‌ను అగ్రరాజ్యం ప్రశంసించింది. రఖైన్‌ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సలహా కమిటీ సిఫారస్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మయన్మార్‌ సర్కార్‌ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com