బ్రిటన్‌లోని రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుతూ... నోటి దగ్గరకే ఆహారం

- October 23, 2017 , by Maagulf
బ్రిటన్‌లోని  రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుతూ... నోటి దగ్గరకే ఆహారం

రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ నేరుగా మన నోటి దగ్గరకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి బాటలు పరిచే పరిజ్ఞానాన్ని బ్రిటన్‌లోని ససెక్స్‌ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు. అత్యధిక పౌనఃపున్య శబ్ద తరంగాల సాయంతో ఆహార పదార్థాలను గాల్లోకి లేపడంపై వారు దృష్టిసారించారు. ఒకే పౌనఃపున్యంతో రెండు భిన్న తరంగాలను ఎదురెదురుగా పంపితే జనించే స్థిర తరంగాలతో ఆహారాన్ని తరలించొచ్చని నిరూపించారు. 'స్థిర తరంగాలతో... ఆహారం బరువు తగ్గడంతోపాటు గాల్లో స్థిరంగా ఉంటుంది. దీంతో కన్వేయర్‌ బెల్ట్‌పై పంపినట్టే పదార్థాలను గాల్లో పంపించొచ్చు'అని పరిశోధకులు షీ తన్నావీ తెలిపారు. అంతేకాదు ఆహారం గాల్లో తేలుకుంటూ వస్తే.. దానిలోని తీపిదనం కూడా పెరుగుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com