సినిమా థియేటర్లలో జాతీయ గీతం వచిన్నపుడు నిల్చోవడం దేశభక్తికి కొలమానం కాదు

- October 23, 2017 , by Maagulf
సినిమా థియేటర్లలో జాతీయ గీతం వచిన్నపుడు నిల్చోవడం దేశభక్తికి కొలమానం కాదు

సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించే సమయంలో నిల్చోవడమే దేశభక్తికి కొలమానం కాదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ' థియేటర్లలో జాతీయ గీతం ఆలపించనంత మాత్రాన వారికి దేశభక్తి లేదని అనుకోకూడదు' అని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తి అన్ని సమయాల్లోనూ సమానమైన దేశభక్తిని ప్రదర్శించలేడు అని కోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ గీతం పాడటం తప్పనిసరి అనే విషయాన్ని వ్యతిరేకిస్తే తమను దేశద్రోహులుగా భావిస్తారని ప్రజలు భయపడుతున్నారని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సినిమా హాళ్లలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లోనూ జాతీయ గీతం ఆలాపన విషయంలోనూ సరైన నిబంధనలు, నియమాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సినిమాహాళ్లలో జాతీయ గీతం ప్రదర్శన నిబంధనల్లో సవరణలు చేయాలని కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. 'భారత్‌ చాలా వైవిధ్య భరితమైన దేశమని, దేశంలో ఏకత్వం తీసుకుని రావడానికి దేశవ్యాప్తంగా సినిమాహాళ్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించడం అవసరం' అని కేంద్రం తరుపున హాజరైన అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. సినిమాహాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని గత ఏడాది డిసెంబరు 1న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com