హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ టొబాక్‌ లైంగికంగా వేధించారు

- October 23, 2017 , by Maagulf
హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ టొబాక్‌ లైంగికంగా వేధించారు

38 మంది మహిళల ఆరోపణ 
హాలీవుడ్‌లో మళ్లీ కలకలం 
హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని మర్చిపోకముందే తాజాగా మరో ప్రముఖుడి నిర్వాకం బయటపడింది! 'బగ్సీ' చిత్రానికిగాను ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ అవార్డు(1991)కు నామినేట్‌ అయిన అమెరికా దర్శకుడు జేమ్స్‌ టొబాక్‌ తమను లైంగికంగా వేధించారని 38 మంది మహిళలు ఆరోపించారు. 'లాస్‌ ఏంజిలెస్‌ టైమ్స్‌' వార్తాసంస్థ ముందు వారు ఈ విషయాలను వెల్లడించారు. తాను పనిలోకి తీసుకున్న మహిళలపై, పనికోసం వెతుకుతున్న స్త్రీలపై, వీధుల్లో కనిపించిన మహిళలపై టొబాక్‌ వేధింపులకు పాల్పడినట్లు సదరు వార్తాసంస్థ వెల్లడించింది. స్టార్‌ హోదా ఇప్పిస్తానని వాగ్దానం చేసి వీధుల్లో పలువురిని ఆయన లొంగదీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది.

మహిళలతో సమావేశమైనప్పుడు.. ప్రముఖులతో తనకు లైంగిక సంబంధాలున్నాయని టొబాక్‌ ప్రగల్భాలు చెప్పుకోవడంతోపాటు అవమానకరరీతిలో వ్యక్తిగత ప్రశ్నలు అడిగేవారని వివరించింది. అనంతరం వారి ముందు అనుచిత లైంగిక ప్రవర్తన కనబర్చేవారని వెల్లడించింది. టొబాక్‌ వేధింపులను ప్రస్తుతం బయటపెట్టిన 38 మంది మహిళల్లో ఎవరూ ఆయనపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపింది.

తనపై వచ్చిన ఆరోపణలను 72 ఏళ్ల టొబాక్‌ తోసిపుచ్చారు. సదరు మహిళలను తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com