హైదరాబాద్ కు చెందిన వ్యాపారి దుబాయ్‌లో భార్యాపిల్లల్ని వదిలేసిన ప్రబుద్దుడు
- October 24, 2017
దుబాయ్‌లో భార్యాపిల్లల్ని కట్టుబట్టలతో నడిరోడ్డుపై వదిలేశాడో ప్రబుద్ధుడు. దీంతో వారు దిక్కులేనివారయ్యారు. సాయం కోసం అర్థిస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వెంగళరావుపేటకు చెందిన కట్ట స్వాతి ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పని చేసేది. అక్కడే పరిచయమైన మహ్మద్ రఫీ.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐతే.. రఫీకి అంతకుముందే పెళ్లైనట్లు స్వాతికి ఆలస్యంగా తెలిసింది. రెండు నెలల కిందట.. దుబాయ్‌లో పని చేసుకుంటూ.. హ్యాపీగా బతుకుదామని స్వాతిని నమ్మించాడు. మొదటి భార్యతోపాటు స్వాతిని కూడా దుబాయ్ తీసుకెళ్లాడు. స్వాతిని అక్కడే వదిలేసిన రఫీ.. మొదటి భార్యతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్వాతి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. గత పది రోజులుగా దుబాయ్ రోడ్ల వెంట తిరుగుతోంది. స్థానికుల సహాయంతో తన అక్క నాగమణికి ఫోన్ చేసింది. దేశంకాని దేశంలో తాను పడుతున్న బాధల్ని వివరించింది. ఎలాగైనా తనను స్వదేశం చేర్చాలని వేడుకుంది. దీంతో స్వాతి అక్క నాగమణి.. వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో ఉన్న తన చెల్లిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







