హైదరాబాద్ కు చెందిన వ్యాపారి దుబాయ్‌లో భార్యాపిల్లల్ని వదిలేసిన ప్రబుద్దుడు

- October 24, 2017 , by Maagulf
హైదరాబాద్ కు చెందిన వ్యాపారి దుబాయ్‌లో భార్యాపిల్లల్ని వదిలేసిన ప్రబుద్దుడు

దుబాయ్‌లో భార్యాపిల్లల్ని కట్టుబట్టలతో నడిరోడ్డుపై వదిలేశాడో ప్రబుద్ధుడు. దీంతో వారు దిక్కులేనివారయ్యారు. సాయం కోసం అర్థిస్తున్నారు. జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా వెంగళరావుపేటకు చెందిన కట్ట స్వాతి ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పని చేసేది. అక్కడే పరిచయమైన మహ్మద్‌ రఫీ.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐతే.. రఫీకి అంతకుముందే పెళ్లైనట్లు స్వాతికి ఆలస్యంగా తెలిసింది. రెండు నెలల కిందట.. దుబాయ్‌లో పని చేసుకుంటూ.. హ్యాపీగా బతుకుదామని స్వాతిని నమ్మించాడు. మొదటి భార్యతోపాటు స్వాతిని కూడా దుబాయ్ తీసుకెళ్లాడు. స్వాతిని అక్కడే వదిలేసిన రఫీ.. మొదటి భార్యతో తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్వాతి నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. గత పది రోజులుగా దుబాయ్‌ రోడ్ల వెంట తిరుగుతోంది. స్థానికుల సహాయంతో తన అక్క నాగమణికి ఫోన్‌ చేసింది. దేశంకాని దేశంలో తాను పడుతున్న బాధల్ని వివరించింది. ఎలాగైనా తనను స్వదేశం చేర్చాలని వేడుకుంది.  దీంతో స్వాతి అక్క నాగమణి.. వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  దుబాయ్‌లో ఉన్న తన చెల్లిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com