ప్రాస్టిట్యూషన్‌: 14 ఏళ్ళ బాలికను రక్షించిన దుబాయ్‌ పోలీస్‌

- October 24, 2017 , by Maagulf
ప్రాస్టిట్యూషన్‌: 14 ఏళ్ళ బాలికను రక్షించిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌ పోలీస్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ టీమ్స్‌, 14 ఏళ్ళ బాలికను వ్యభిచార కూపం నుంచి రక్షించారు. రెండు నెలలపాటు ఆమెపై అత్యాచారం జరిపారనీ, ఆమెపై వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతపెట్టారని పోలీసులు వివరించారు. సంఘటనా స్థలం నుంచి పలువురు మహిళల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వయసు 24 ఏళ్ళుగా పేర్కొంటూ ఆసియా నుంచి ఆమెను జీసీసీ దేశాల మీదుగా దుబాయ్‌కి తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. బాధితురాలిని దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అండ్‌ విమెన్‌ కేర్‌కి తరలించారు. నిందితులపై ట్రయల్‌ ముగిసేంతవరకు బాలికను అక్కడే ఉంచనున్నారు. నిందితుల నుంచి తాను ఏమాత్రం డబ్బు తీసుకోలేదని, విటుల దగ్గరకు తనను బలవంతంగా పంపించేవారనీ, ఆ సమయంలో బాధతో ఏడ్చేదాన్ననని బాధితురాలు చెప్పింది. బాలిక విషయమై కాన్సులేట్‌తో మాట్లాడుతున్నామని హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌ షయీర్‌ చెప్పారు. ఈ ఘటనలో బంగ్లాదేశ్‌కి చెందిన మహిళ, పురుషుడ్ని నిందితులుగా తేల్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com