రోబో 2.ఓ ఆడియో వేడుకకు ముఖ్య తిధిగా కమల్
- October 24, 2017
రజని కాంత్ తాజా సినిమా 2.0 ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్ అయినప్పటినుంచి ఈఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ఎవరు? ఐ సినిమాకు అర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ ను తీసుకొచ్చిన శంకర్, ఈసినిమా ఆడియోకు ఎవరిని ఇన్వైట్ చేశాడని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శంకర్ ఈ 2.0ఫంక్షన్ కు రజనీ సన్నిహితుడు యూనివర్సల్ స్టార్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
ఇండియన్ సినిమా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ టు పాయింట్ ఓ. శంకర్-రజనీకాంత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా విజువల్ గ్రాండియర్ గా అదరగొడుతుందని, ఓ హాలివుడ్ మూవీ రేంజ్ లో సౌత్ ఇండియన్ సినిమా స్థాయి పెంచుతుందని కోలీవుడ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంది. దీనికితగ్గట్లుగానే శంకర్ కూడా ఈ సినిమాను లార్జ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. 2డి, 3డి రెండు వెర్షన్స్ లోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లీడ్ రోల్స్ చేస్తోన్న ఈసినిమాలో ఎమీ కూడా రోబోగానే కనిపించబోతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ ఈసినిమా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని హింట్స్ ఇచ్చాయి. ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో, 2పాయింట్ ఓ ఆల్బమ్ మెస్మరైజింగ్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ బజ్ ను మరింత పెంచేలా రోబో-2 ఆడియోను ఈనెల27న దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.
2పాయింట్ ఓ సాంగ్స్ ను రెహ్మాన్ లైవ్ లో పెర్ఫామ్ చెయ్యబోతున్నాడు. ఈ ప్రస్టీజియస్ ఈవెంట్ కు కమల్ హాసన్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నారట శంకర్ అండ్ టీం. కమల్, రజనీ మంచి స్నేహితులు కాబట్టి కమల్ కూడా ఈ ఈవెంట్ కు వెళ్తున్నాడట. ఇక 450కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణమైన ఈసినిమా 2018 జనవరి 25న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







