జఫ్రన్ షర్బత్
- October 24, 2017
కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), పంచదార - 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూను, రాత్రి నానబెట్టిన బాదం పప్పులు - 12, పిస్తా - 8, జీరాపొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో 5 నిమిషాలు వేడిచేసి దించేయాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకుల్ని వేసి బాగా కలపాలి. గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబడ్డాక తీసి గ్లాసుల్లోకి నింపి పైన జీరా పొడి చల్లాలి. ఈ షర్బత్ వేసవి తాపాన్ని తీర్చే ఔషధంలా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







