ఉత్తర్‌ప్రదేశ్‌లో స్విస్ జంటపై దాడి.. స్పందించిన సుష్మా
- October 26, 2017
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఆదివారం ఓ విదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. 'దాడి గురించి నాకు ఇప్పుడే తెలిసింది. దీనిపై యూపీ ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జంటను మా అధికారులు కలుస్తారు.' అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
స్విట్జర్లాండ్‌కు చెందిన క్వెంటిన్ జెరెమీ క్లెర్క్ తన ప్రేయసి మ్యారీ డ్రోజ్‌తో కలిసి సెప్టెంబర్ 30న భారత్ పర్యటనకు వచ్చారు. గత ఆదివారం వారు యూపీలో ఫతేపూర్ సిక్రీ రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తుండగా.. కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. వారిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో క్వెంటిన్, మ్యారీ గాయపడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







