సయీద్ షాహిద్ నివాసంపై ఎన్ఐఏ మెరుపుదాడి
- October 26, 2017
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ షాహిద్ యూసఫ్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై గత మంగళవారం యూసఫ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. బుద్గాం జిల్లాలోని సోయ్బుగ్ గ్రామంలోని యూసఫ్ నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
యూసఫ్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు. 2011లోని కేసుకు సంబంధించి ఆయనకు సమన్లు అందడంతో గత మంగళవారం అతడు ఎన్ఐఏ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా విచారించిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. సయ్యద్ సలావుదీన్ ఆదేశాల మేరకు 2011-14 మధ్య గులామ్ మహ్మద్ భట్(ఇవే ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు).. యూసఫ్‌కు డబ్బులు బదిలీ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులోతదుపరి విచారణ కోసం యూసఫ్‌ను ఏడు రోజుల కస్టడీకి తరలించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







