ఫిఫా వరల్డ్ కప్ అండర్-17 ఫైనల్‌కు క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలీ
- October 26, 2017
భారత్ తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ చివరిదశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడింయలో శనివారం (అక్టోబర్ 28)న ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లు హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి.
పైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తున్న సాల్ట్ లేక్ స్టేడియం ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దగ్గరుండి పర్వవేక్షిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించి ఏ దశ టోర్నీకైనా భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
దీంతో ఆ బాధ్యతలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు, ఏఐఎఫ్ఎఫ్ సుప్రిమో ప్రపుల్ పటేల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు భారత పుట్‌బాల్ దిగ్గజాలు హాజరుకానున్నారు.
ఫిఫా అండర్-17కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో 'సచిన్‌తో కలిసి ఫైనల్ మ్యాచ్‌ను స్వయంగా వీక్షిస్తాను' అని గంగూలీ గురువారం మీడియాకు తెలిపాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ని మట్టికరిపించి తొలిసారి ఇంగ్లాండ్ యు-17 ఫైనల్‌కు చేరింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో బ్రెజిల్ 3-1తో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఆటగాడు రియాన్ బ్రూస్టర్ రికార్డుస్థాయిలో రెండోసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించి తన జట్టును ఫైనల్ చేర్చాడు. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు క్వార్టర్స్ కూడా చేరుకుని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







