హెచ్1బీ వీసా రెన్యువల్ మరింత కష్టం
- October 26, 2017
భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ, ఎల్1 వంటి వీసాల రెన్యువల్‌ను అమెరికా మరింత కష్టతరంగా మార్చింది. రెన్యువల్‌కు తాను అన్ని విధాలా అర్హుడినేనని దరఖాస్తుదారుడే నిరూపించుకోవాలని అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. ఇందుకోసం ప్రస్తుతమున్న 13 ఏళ్ల నాటి నిబంధనను సవరించి కొత్త వాటిని అమల్లోకి తెచ్చింది.
పాత పద్ధతిలో దరఖాస్తుదారుడి మరో సారి వీసా పొందేందుకు అర్హుడా? కాదా? అనే విషయాన్ని యూఎస్‌సీఐఎస్‌యే నిర్ధారించేది. ఈ విధానం ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి వర్తిస్తుందని, కొత్త దరఖాస్తదారులకు వర్తించదని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విలియం స్టాక్ అన్నారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని, అమెరికా ఉద్యోగాలను ఇతర దేశస్తులు తన్నుకుపోకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







