నవంబర్ 7న కీలక ప్రకటన చేయబోతున్న కమల్ హాసన్
- October 26, 2017
తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సినీ నటుడు కమల్ హాసన్ .. గెట్ రెడీ అంటూ ఫ్యాన్స్‌కు మెసేజ్ ఇచ్చాడు. నవంబర్ 7న కీలక ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించాడు. తమిళ మ్యాగజైన్‌కు రాసిన ఆర్టికల్‌లో ఈ విషయాన్ని తెలిపాడు కమల్. తనను ఎలా సంప్రదించాలో.. ఏం చేయాలో.. అన్నీ ఆ రోజు చెబుతున్నాన్నాడు.
నవంబర్7 కమల్ హాసన్ పుట్టిన రోజు. అందుకే.. ఆ రోజు చేస్తానన్న ప్రకటన రాజకీయ ప్రవేశం గురించే అయ్యి ఉంటుందనుకుంటున్నారు అభిమానులు. కొంతకాలంగా రాజకీయ ప్రవేశానికి సంబంధించి సన్నాహాలు చేసుకుంటున్నారు కమల్. ముఖ్యంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపై అన్ని విషయాల్లోనూ ఒంటికాలిపై లేస్తున్నారు. కమల్ పార్టీ ఎలా ఉండబోతోంది.. పొత్తులు ఏవైనా ఉంటాయా అన్నది నవంబర్ 7న తేలిపోనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







