'అన్న' తెలుగు పదానికి ఇంటర్ నేషనల్ గుర్తింపు
- October 26, 2017
'అన్న' అంటే తెలుగులో, తమిళంలో సోదరుడు అని అర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల అప్డేట్ చేసిన ఈ నిఘంటువులో తాజాగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన 70 భారతీయ పదాలను చేర్చారు.
రూపాయిలో ఆరో వంతుకు సూచికగా ఇంతకుమును 'అణా' ( Anna) అనే పదం ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉండేది. ఇప్పుడు అదే ఆంగ్ల పదాల స్పెల్లింత్ అన్న, అన్నన్ పదాలను నిఘంటువులో చేర్చారు. ఉర్దూ పదం 'అబ్బా' (తండ్రి)ను నిఘంటువులో పొందుపర్చారు. అచ్చా, బాపు, బాడా దిన్, బచ్చా, సూర్య నమస్కార్ వంటి పదాలు ఈ నిఘంటువులో చోటు సంపాదించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







