రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలం 1985' సాంగ్ షూటింగ్
- October 26, 2017
రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కమర్షియల్ మూవీసే ఎక్కువ. ప్రయోగాలు చేసిన ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే నిరాశపరిచాయి. అయినా పట్టువదలకుండా ధృవ మూవీతో కాస్త వైవిధ్యం చూపించి సక్సెస్ అయ్యాడు. గతేడాది వచ్చిన ధృవ మంచి విజయాన్ని అందుకుంది.
ధృవ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం 1985. మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీకి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ డైరెక్టర్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే సుకుమార్... రంగస్థలంతో ఈ సారి ముప్పై ఏళ్లు ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్ళబోతున్నాడు. 1985 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అందుకే సినిమా కోసం మెగా అభిమానులతో పాటు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రంగస్థలం మూవీ 1985 కాలం నాటి కథ కాబట్టి, అప్పటిలానే సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. గోదావరి పరిసరాల్లోనూ గ్రామాల్లో ఎక్కువ బాగం షూట్ జరిగింది. అలాగే పాటల్లోనూ అప్పటి కాలం గుర్తొచ్చేలా సెట్స్ వేస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ ఆర్ట్ వర్క్ కి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం రంగస్థంలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ స్టిల్ ని కూడా రిలీజ్ చేసింది టీమ్.
రంగస్థలం మూవీలో రామ్ చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి గడ్డం, లుంగీతో కనిపించబోతున్నాడు చరణ్. ఇక చెర్రీకి జోడీగా సమంత నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ అంచనాలున్న రంగస్థలం 1985, వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







