తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా'
- October 26, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రోబో సీక్వెల్ 2.0. శంకర్ దర్శకత్వంలో రూ.400ల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్. ఆల్ రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రోబో సీక్వెల్ కంప్లీట్ అవ్వకముందే రజనీకాంత్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే 'కాలా'. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కబాలి'. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి కసితో ఈ సినిమా చేస్తోంది టీమ్.
'కాలా' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముంబయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుందంటున్నారు. ధనుష్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాని వచ్చే సమ్మర్‌లో ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







