వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే..

- October 26, 2017 , by Maagulf
వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే..

వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని.. వెన్నలోని ఎ విటమిన్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. 
 
అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్య తలెత్తదు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ వుండటం ద్వారా చిన్నపిల్లలకు ఇవ్వడం ద్వారా మేలే జరుగుతుంది. 
 
చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం ద్వారా.. వారి మెదడూ, నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటుంది చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేయడం మంచిది. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com