'మేము' చిత్రం ఆడియో ఈనెల 9 విడుదల కానుంది

- November 06, 2015 , by Maagulf
'మేము' చిత్రం ఆడియో ఈనెల 9 విడుదల కానుంది

సూపర్ ‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న 'మేము' చిత్రం ఆడియో ఈనెల 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సన్నితి ప్రొడక్షన్స్‌ అధినేత ప్రసాద్‌ సన్నితి- శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్‌ అధినేత తమటం కుమార్‌రెడ్డి ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు. 'పిశాచి' ఫేం అర్రోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వెన్నెలకంటి-సాహితి-చంద్రబోస్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. హైద్రాబాద్‌, హైటెక్‌ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికపై జరగనున్న ఈ ఆడియో వేడుకలో సూపర్‌స్టార్‌ సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి, చిత్ర దర్శకుడు పాండిరాజ్‌, సంగీత దర్శకుడు అర్రల్‌ కొరెల్లి తదితర చిత్ర బృందంతోపాటు.. మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అతిరధమహారధులు అతిధులగా పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. 'సూర్య సినిమాకు తెలుగులో గల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. 'మేము' ఆడియో ఫంక్షన్‌ను శిల్పకళా వేదికపై అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మొత్తం 'మేము' చిత్ర బృందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు' అన్నారు. శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్యకె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com