కంటి చూపును మెరుగుపరిచే చిట్కా

- October 27, 2017 , by Maagulf
కంటి చూపును మెరుగుపరిచే చిట్కా

ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది. రోజురోజుకు కళ్ళ జోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. చాలా మంది చిన్నప్పటి నుంచే ఎక్కువ సైట్ కలిగిన కంటద్దాలను వాడుతున్నారు. కంటి చూపు మందగించడం వల్ల వేరే కంటి సమస్యలు వస్తున్నాయి. మన తాతల కాలంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల వారికి కంటి సమస్యలు వచ్చేది కాదు. కానీ మనం ఏది పడితే అది తినడం వల్ల కంటి చూపు సమస్య వస్తోంది. విటమిన్ లోపం వల్ల కంటి చూపు వస్తోంది.
 
చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి లేజర్ ఆపరేషన్లకు వెళుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. కొన్ని చిట్కాలను పాటిస్తే కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. అదే కుంకుమ పువ్వు. ఒక కప్ తాగునీరు, ఒక గ్రాము కుంకుమ పువ్వు తీసుకోవాలి. 
 
ఒక పాత్రలో నీరు పోసి బాగా వేడైన తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసి ఒక నిమిషం మాత్రమే తక్కువ మంటతో వెలిగించాలి. ఆ తర్వాత స్టౌ ఆపి పూర్తిగా మిశ్రమం చల్లారిన తర్వాత మీకు తియ్యదనం కోసం తేనె కలిపి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే మీ కంటిచూపు మెరుగుపడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com