స్పీడ్ లిమిట్ తగ్గింపు ప్రాణాల్ని కాపాడేందుకే
- October 27, 2017
దుబాయ్‌లో 2 ముఖ్యమైన రోడ్లపై స్పీడ్ లిమిట్‌ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్‌ఎఫైర్స్ - ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ అండ్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ముహమమ్మద్ అల్ జఫీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్పీడ్ లిమిట్ తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని చెప్పరాయన. అక్టోబర్‌లో దుబాయ్ పోలీసులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ అలాగే ఎమిరేట్స్ రోడ్‌పై 120 నుంచి 110కి స్పీడ్ లిమిట్‌ని తగ్గించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే వాహనాలతో పోల్చితే 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే వాహనాల కారణంగా ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వివరించారు. స్పీడ్ లిమిట్‌ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







