స్పీడ్ లిమిట్ తగ్గింపు ప్రాణాల్ని కాపాడేందుకే
- October 27, 2017దుబాయ్‌లో 2 ముఖ్యమైన రోడ్లపై స్పీడ్ లిమిట్‌ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ఎఫైర్స్ - ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ అండ్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ముహమమ్మద్ అల్ జఫీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. స్పీడ్ లిమిట్ తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని చెప్పరాయన. అక్టోబర్‌లో దుబాయ్ పోలీసులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ అలాగే ఎమిరేట్స్ రోడ్‌పై 120 నుంచి 110కి స్పీడ్ లిమిట్‌ని తగ్గించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే వాహనాలతో పోల్చితే 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే వాహనాల కారణంగా ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వివరించారు. స్పీడ్ లిమిట్‌ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు