దుబాయ్ గ్లోబల్ విలేజ్ లో పూర్తి భద్రతా ఏర్పాట్లు

- November 06, 2015 , by Maagulf
దుబాయ్ గ్లోబల్ విలేజ్ లో పూర్తి  భద్రతా ఏర్పాట్లు

75 దేశాల నుండి ఒక మిలియన్ సందర్శకులు విచ్చేసే అవకాసం ఉన్నందున, దుబాయ్ ‘గ్లోబల్ విలేజ్’ లో భద్రతా ఏర్పాట్లను దుబాయ్ పోలీసులు  పూర్తి చేసినట్టు, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ - బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ ఘైతి తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని గురించిన వ్యాఖ్యానాలను, ఈ సంవత్సరం సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ 20 వ సెషన్ లో షాపింగ్, పర్యటన మరియు వినోద కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఇక్కడ ఒక పిల్లల సంరక్షణా స్థలాన్ని  ఏర్పాటు చేసినట్టు, ట్రాఫిక్ జాం లను నివారించడానికి ముఖ్యంగా వారాంతాలలో ప్రజా రవాణా సదుపాయాలను, ట్రాఫిక్ ఏర్పాట్లను చేసినట్టు ఆయన తెలుపుతూ, ఈ సౌకర్యాలను వినియోగించుకుని తమకు సహకరించవలసిందిగా  ఆయన ప్రజలను, సందర్శకులను విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com