ఉత్తరకొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.!

- October 28, 2017 , by Maagulf
ఉత్తరకొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.!

జగడాల మారి ఉత్తరకొరియాకు అమెరికా రక్షణశాఖ మంత్రి జిమ్‌ మాటిస్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తరకొరియా అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. తాము భారీ సైనిక బలగంతో బదులివ్వాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యలపై ఘాటుగా స్పందించారు.

'అమెరికా, మా మిత్ర దేశాలపైన దాడులు చేస్తే.. వాటిని మేము దీటుగా తిప్పికొడతాం. మీరు అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. మేము సమర్థమంతమైన భారీ సైనిక బలగంతో స్పందిస్తాం' అని మాట్టిస్‌ హెచ్చరించారు. ఇటీవల ఉత్తరకొరియా ఆరో అణుపరీక్ష చేయడాన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అప్పటి నుంచి ట్రంప్‌, కిమ్‌జోంగ్‌ ఉన్‌ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు.

తరచూ అణుపరీక్షలు చేస్తున్న ఉ.కొరియాను అదుపు చేసేందుకు అమెరికా పలు దేశాలను ఏకం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ దేశానికి అడ్డుకట్ట వేసేందుకే ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉ.కొరియాపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com