ఇకపై మధ్యేవాద విధానాలు పాటిస్తామని సౌదీ యువరాజు ప్రకటన
- October 28, 2017
రియాధ్ : తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని, మధ్యేమార్గ ఇస్లామ్ విధానాలను అనుసరిస్తామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అన్ని మతాల వారికి ద్వారాలు తెరిచామని గురువారం ఇక్కడ జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన ప్రకటించగానే ఒక్కసారిగా హర్షధ్వానాలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలంతో మా జీవితాలను 30ఏళ్ళు వృధా చేసుకోదలుచుకోలేదని, తీవ్రవాదాన్ని సమూలంగా పారద్రోలుతామని అన్నారు. కఠినమైన ఇస్లాం విధానాలు పునాదిగా ఏర్పడిన ఈ దేశంలో ఇప్పుడు ఆ భావనలు ప్రభావం చూపడం లేదని భావిస్తున్న నేపథ్యంలో యువరాజు వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఎర్ర సముద్రం తీరంలో 500 బిలియన్ల డాలర్ల వ్యయంతో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో లేని జీవన విధానాన్ని ఈ కొత్త నగరంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. 2015 నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికారాన్ని చేపట్టిన ఆయన అనేక సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్నారు. చమురు రంగంలో అగ్రగామి సంస్థ సౌదీ అరామ్‌కో లో కొంత వాటాను విక్రయించి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సార్వభౌమ సంపన్న నిధిని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. సామాజికంగా నెలకొన్న కొన్ని అవరోధాలను కూడా అధిగమించారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







