హై కోర్ట్ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి : రాంనాథ్ కోవింద్
- October 28, 2017
దేశంలో హైకోర్టులు ఇచ్చే తీర్పులను ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. శనివారం జరిగిన కేరళ హైకోర్టు వజ్రోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టులు ప్రజలకు న్యాయమై తీర్పులు ఇవ్వడమే కాదు.. వారికి అర్థమయ్యే భాషలోనూ వాటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
'మన దేశంలో ఎన్నో భాషలున్నాయి. న్యాయస్థానాలు ఇంగ్లీషులో తీర్పు ఇవ్వడం వల్ల ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకోలేరు. అందువల్ల న్యాయవాదులు, ఇతర వ్యక్తులను సంప్రదించాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతుంది' అని రాష్ట్రపతి అన్నారు.
'కేసుల విచారణలో జాప్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ముఖ్యమైన కేసుల విచారణలో వాయిదాలను నివారించి వీలైనంత త్వరగా కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి' అని కోవింద్ సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నవనీతి ప్రసాద్ సింగ్, కేరళ గవర్నర్ పి.సదాశివం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







