వేశ్యావాటికలో యువ హీరోయిన్

- October 29, 2017 , by Maagulf
వేశ్యావాటికలో యువ హీరోయిన్

సినీ పరిశ్రమలో ఎదైనా ఛాలెంజింగ్ రోల్ లభిస్తే దాని కోసం భారీగా ఎక్సర్‌సైజ్ చేస్తారు. అందుకోసం ఎంతకైనా సిద్ధపడుతారు. అదే కోవలో చేరారు యువనటి శోభితా ధూలిపాళ. త్వరలో హిందీ, మలయాళ భాషల్లో రూపొందే చిత్రం కోసం ఆమె ఇటీవల ముంబైలోని కామటిపురాలోని వేశ్యవాటికలో పర్యటించారు. అక్కడి వేశ్యల జీవిత స్థితిగతులను ఆమె అధ్యయనం చేవారు. కేవలం పాత్ర కోసమే కాకుండా, అక్కడి మహిళ జీవితాల గురించి విలువైన సమాచారం తెలుసుకొనే అవకాశం ఏర్పడిందని శోభితా అన్నారు. మోథూన్ అనే చిత్రంలో ఓ మంచి పాత్ర లభించింది. కామటిపురాలో నివసించే సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తున్నాను. గెరిల్లా పద్ధతిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఇరుకు గదుల్లో నివసించే వారి జీవితాలను దగ్గర నుంచి పరిశీలించాను. అదొక గొప్ప అనుభవం అని శోభితా చెప్పింది. 
సమాజంలో మరో కోణాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్. మంచి ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ దొరకడం నిజంగా అదృష్టం అని ఆమె తెలిపింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటలు రాస్తున్నారు. గీతా మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గతంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంలో శోభితా ధూలిపాళ నటించారు. ఆమె సరసన వికీ కౌశల్ నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్‌తో నటించిన చెఫ్ చిత్రం ఇటీవల విడుదలైంది. మంచి టాలెంట్ ఉన్న యువ హీరోయిన్లలో ఒకరిగా చెప్పుకొనే శోభితా హిందీ, దక్షిణాది పరిశ్రమలో పేరు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com