'నాన్న కూచి' అంటున్న నిహారిక
- October 29, 2017
హైదరాబాద్: 'ముద్దపప్పు ఆవకాయ' వెబ్‌సిరీస్‌తో నటిగా పరిచయమైన మెగా హీరోయిన్ నిహారిక. ఈ సిరీస్‌తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. దీని తర్వాత ఆమె 'నాన్న కూచి' అనే మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో నిహారిక తండ్రి, సీనియర్ నటుడు నాగబాబు ఆమె తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ నాగబాబు పుట్టినరోజు సందర్భంగా 'నాన్న కూచి' ట్రైలర్‌ను విడుదల చేశారు. తండ్రికుమార్తె అనుబంధంతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు వరుణ్‌తేజ్ ట్వీట్ చేశారు.
బి. ప్రణీత్ 'నాన్న కూచి'కి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విద్యా సాగర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిహారిక 'ఒకమనసు' చిత్రంతో కథానాయికగా వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హీరో సుమంత్ అశ్విన్ సరసన 'హ్యాపీ వెడ్డింగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష