బురైమి నుండి 1,253 మాదక ద్రవ్య మాత్రల అక్రమ రవాణా చేస్తున్న ఓమాని మహిళ అరెస్టు
- October 29, 2017
మస్కట్:బురుమై గవర్నైట్ పరిధిలో మానసిక సంబంధిత రోగులు ఉపయోగించే మత్తు పదార్థాలు కలిగిఉన్న1,253 మాత్రలను వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఒక ఒమన్ మహిళను నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలపై పోరాట డైరెక్టరేట్ జనరల్ అరెస్టు చేశారు. ఆమె అక్రమ రవాణాకు పాల్పడుతుందనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు తమ ట్వీట్టర్ ఖాతాలో తెలిపారు. ఆ మహిళ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు. ఈ తరహాలో అక్రమ మాధక ద్రవ్యాలను తరలించే అనుమానితులు, స్మగ్లర్లకు సంబంధించిన కీలకమైన సమాచారం గూర్చి ఏమైనా తెలియచేయాలనుకొంటే పౌరులు మరియు నివాసితులు 9999 ఫోన్ నెంబర్ కు తెలియచేయాలని లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద తెలియచేయవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్య వినియోగదారులు మరియు వ్యాపారులను గుర్తించడానికి సహాయపడే ఎటువంటి సమాచారం అయినా నిరభ్యంతరంగా నివేదించడానికి వెనుకాడవద్దని ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







