బురుమై నుండి 1,253 మాదక ద్రవ్య మాత్రల అక్రమ రవాణా చేస్తున్న ఓమాని మహిళ అరెస్టు

- October 29, 2017 , by Maagulf
బురుమై నుండి 1,253 మాదక ద్రవ్య మాత్రల అక్రమ రవాణా చేస్తున్న ఓమాని మహిళ  అరెస్టు

బురుమై గవర్నైట్ పరిధిలో మానసిక సంబంధిత రోగులు ఉపయోగించే మత్తు పదార్థాలు కలిగిఉన్న1,253 మాత్రలను వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఒక ఒమన్ మహిళను నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలపై పోరాట డైరెక్టరేట్ జనరల్ అరెస్టు చేశారు. ఆమె అక్రమ రవాణాకు పాల్పడుతుందనే  ఆరోపణలపై అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు తమ ట్వీట్టర్ ఖాతాలో తెలిపారు. ఆ మహిళ పై  కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు. ఈ తరహాలో అక్రమ  మాధక ద్రవ్యాలను తరలించే అనుమానితులు, స్మగ్లర్లకు సంబంధించిన కీలకమైన సమాచారం గూర్చి ఏమైనా తెలియచేయాలనుకొంటే పౌరులు మరియు నివాసితులు 9999 ఫోన్ నెంబర్ కు తెలియచేయాలని లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద తెలియచేయవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్య వినియోగదారులు మరియు వ్యాపారులను గుర్తించడానికి సహాయపడే ఎటువంటి సమాచారం అయినా నిరభ్యంతరంగా నివేదించడానికి వెనుకాడవద్దని ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ప్రజలకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com