దుబాయ్‌లో 24 మిలియన్‌ దిర్హామ్‌లకే లగ్జరీ విల్లా

- October 29, 2017 , by Maagulf
దుబాయ్‌లో 24 మిలియన్‌ దిర్హామ్‌లకే లగ్జరీ విల్లా

దుబాయ్‌: జుమైరా గోల్ఫ్‌ ఎస్టేట్‌లో 20 లగ్జరీ విల్లాస్‌ ప్రాజెక్ట్‌ని చి-సోల్‌ ఇన్వెస్టిమెంట్స్‌ చేపట్టింది. హై-ఎండ్‌ ప్రాపర్టీస్‌ కేటగిరీలో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. 24 మిలియన్‌ దిర్హామ్‌ల ప్రారంభ ధరతో ఈ విల్లాస్‌ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. 2018 మే నాటికి ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుంది. 12,000 నుంచి 16,000 చదరపు అడుగుల విస్తీరణంలో, ఒక్కోటి ఆరు బెడ్రూమ్స్‌తో ఈ విల్లాస్‌ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సాధారణ లివింగ్‌ సేస్పెసస్‌, ఎలివేటెడ్‌ స్టడీ రూమ్‌, కిచెన్స్‌తో ఉంటుంది. ఎమిరేట్స్‌ హిల్స్‌ విల్లా ధర 95 మిలియన్‌ దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో బెడ్రూమ్‌, సెకెండ్‌ ఫ్లోర్‌లో పెంట్‌ హౌస్‌, దాంతోపాటుగా ఓ మాస్టర్‌ బెడ్రూమ్‌, ఫ్యామిలీ లివింగ్‌ ఏరియా వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణలు. ఐదు కార్లకు పార్కింగ్‌ సౌకర్యం, బేస్‌మెంట్‌ కూడా ఎయిర్‌ కండిషన్డ్‌ ఈ విల్లాస్‌ ప్రత్యేకత. యూనిక్‌ స్టయిల్‌తో అప్‌ టు డేట్‌ ఆర్కిటెక్చర్‌తో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నట్లు చి-సోల్‌ ఇన్వెస్టిమెంట్స్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ గవిన్‌ కమ్‌ఫోర్డ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com