క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
- October 30, 2017
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ (51) కన్నుమూశారు. నగరంలోని స్టార్ ఆస్పత్రిలో సోమవారం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. హైదరాబాద్ నుంచి రంజీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేశారు. బీసీసీఐ మేనేజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు మేనేజర్‌గా శ్రీధర్ పనిచేశారు. 1988-1999 మధ్యకాలంలో ఆయన 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆయన మృతిపట్ల హైదరాబాద్, బీసీసీఐ క్రికెట్ పెద్దలు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







