టీడీపీని వీడుతున్న ప్రముఖులు
- October 30, 2017
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీలో మరో బాంబు పేలబోతోంది. రాజీనామాల వైరస్‌తో తెలంగాణలో దేశం పార్టీ గందరగోళం అవుతోంది. నిన్నకు నిన్నరేవంత్ రెడ్డి... వచ్చే వారం రాజీనామా చేయడానికి ప్రముఖ నటి కవిత సన్నద్దమయ్యారు. ఈ పరిణామాలు దేనికి సూచిస్తున్నాయి? ఈ ప్రశ్నల నడుమ కవిత రాజీనామా ప్రకటన ఓ సంచలనంగా నిలిచింది. ఆమె వచ్చేవారం టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. 1983 నుంచి టీడీపీకి సేవలందించిన ఆమె పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు కవిత రంగం సిద్ధం చేసుకున్నారు.
కవిత పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెల్లగక్కారు. తన రాజీనామాకు గల కారణాన్ని సవివరంగా తెలియజేస్తూ పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు లేదని, భజనలు చేసే వారికే పార్టీలో ప్రాధాన్య, గుర్తింపు దక్కుతున్నాయని ఆరోపించారు. అంతేకాదు నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటినట్లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు తెలిసి కూడ సీఎం చంద్రబాబు తనకు ఏమీ తెలియనట్టుగా ఉన్నారని అన్నారు. టీడీపీ నాయకులు తన తన కష్టాన్ని గుర్తించకపోగా.. ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను తీవ్ర మనస్తాపం చెందుతున్నానని, తాను చేరేందుకు అనేక .పార్టీలు సిద్దంగా ఉన్నాయన్నారు. మొత్తంమీద కవిత రాజీనామా ప్రకటన ఇటు దేశం వర్గీయుల్లోనూ, అటు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







