క్యారెట్‌, కొత్తిమీర, సోంపు సూప్‌

- October 30, 2017 , by Maagulf
క్యారెట్‌, కొత్తిమీర, సోంపు సూప్‌

కావలసినవి: నాలుగు వందల గ్రాముల క్యారెట్‌ ముక్కలు, అరకప్పు తరిగిన కొత్తిమీర, రెండు టీస్పూన్ల చొప్పున సోంపు, నూనె, కొన్ని మిరియాలు, ఒకటి తరిగిన ఉల్లిపాయ, ఆరు కప్పుల నీళ్లు, ఒక టీస్పూన్‌ మీగడ, తగినంత ఉప్పు.
తయారీ విధానం:
ఒక గిన్నెలో నూనె పోసి మిరియాలు, సోంపు, ఉల్లిముక్కలు వేసి అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి నీళ్లు పోయాలి. క్యారెట్‌లు మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మీగడ వేసి బాగా కలిపి వేడి వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com