మక్కా ప్రధాన ఇమామ్‌ సంచలన వ్యాఖ్యలు

- October 30, 2017 , by Maagulf
మక్కా ప్రధాన ఇమామ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌): ప్రపంచానికే ప్రమాదకారులుగా మారిన ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలపై మక్కా ప్రధాన ఇమామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం శాంతిని ప్రభోధిస్తుందని..అటువంటి ఇస్లాంకు అల్‌ఖైదా, ఐఎస్‌ వంటి సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మక్కా ప్రధాన మసీదులో ముఖ్య ప్రార్థనలను చేయించే షేక్‌ సలేహ్‌ బిన్‌ అబ్దుల్లా బిన్‌ హుమాయిద్‌ ఓ ప్రైవేట్‌ న్యూస్‌ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు.

హింసావాదం అనేది పెనుశాపం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. విభేదాలను పరస్పర అవగాహన కల్మా-ఇ-హఖ్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. జిహాద్‌(పవిత్ర యుద్ధం)కు జవాబుదారీగా ప్రభుత్వాలే ఉంటాయని, ఒక గ్రూప్‌ లేదా వ్యక్తి ఉండజాలవన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్‌ ప్రకారం.. ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తిని చంపటం ఏకంగా మానవత్వాన్ని చంపినట్లేనని చెప్పారు. అసహనం, పరస్పర విభేదాల కారణంగానే ముస్లిం దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com