చైనాలోజాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్లు జైలుకే

- October 31, 2017 , by Maagulf
చైనాలోజాతీయగీతాన్ని అవమానిస్తే మూడేళ్లు జైలుకే

ఓ పక్క భారతదేశంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు నిలబడాలా వద్దా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన చైనా తమ జాతీయజెండాకు సంబంధించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని గౌరవించకపోయినా మూడేళ్లు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలో చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. జాతీయ గీతం ప్రసారం అవుతున్నప్పుడు ఎవరన్నా అవమానకరంగా ప్రవర్తిస్తే వారిని 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాల్సిందిగా సెప్టెంబర్‌లో చైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు కొత్తగా జాతీయ గీతంలోని అక్షరాలు కావాలని తప్పుగా పాడినా, అవమానించినా మూడేళ్లు కారాగార శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిపై ఈ వారంలోనే పార్లమెంట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2015లో హాంకాంగ్‌లో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ గీతం ప్రసారమవుతున్నప్పుడు పలువురు వ్యక్తులు అవమానకరంగా ప్రవర్తించారని వారికి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ యాజమ్యాం జరిమానా విధించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో చైనాలోని ఓ స్మారకస్థూపం వద్ద ముగ్గురు వ్యక్తులు సైనికుల దుస్తులు వేసుకుని సెల్ఫీలు దిగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com