2016 సాఫ్ట్‌ డ్రింక్స్‌ క్యాన్స్‌, బాటిల్డ్‌ వాటర్‌ ధ్వంసం

- October 31, 2017 , by Maagulf
2016 సాఫ్ట్‌ డ్రింక్స్‌ క్యాన్స్‌, బాటిల్డ్‌ వాటర్‌ ధ్వంసం

మనామా: మస్కట్‌ మునిసిపాలిటీ ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌, ఓ రెసిడెన్షియల్‌ హౌస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇటీవల వచ్చిన ఓ ఫిర్యాదు నేపథ్యంలో అల్‌ ఖువాయిర్‌ ప్రాంతంలో ఈ సోదాలు జరిగాయి. రాయల్‌ ఒమన్‌ పోలీసులతో కలిసి తనిఖీల్ని నిర్వహించారు. రెసిడెన్షియల్‌ హౌస్‌ని స్టోర్‌ హౌస్‌గా మార్చారంటూ కొందరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో టీమ్‌ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా పెద్దయెత్తున అక్కడ ఫుడ్‌ స్టఫ్స్‌ని అపరిశుభ్ర వాతావరణంలో ఉంచుతున్నట్లు గమనించారు. 2016 క్యాన్సల సాఫ్ట్‌ డ్రింక్స్‌, అలాగే బాటిల్డ్‌ వాటర్‌ని అధికారులు ధ్వసం చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోనున్నారు అధికారులు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనల్నీ ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మస్కట్‌ మునిసిపాలిటీ ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెడుతోంది. నిబంధనల ఉల్లంఘనపై ఎవరైనా మునిసిపాలిటీకి ఫిర్యాదు చేయవచ్చనీ, ఇందుకోసం కాల్‌ సెంటర్‌ని, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పేజీలను ఉపయోగించుకోవచ్చని మునిసిపాలిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com