బిస్కెట్ బిజినెస్‌లో వెంకటేష్ కూతురు ఆశ్రిత
- November 01, 2017
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో ఉన్నారు ఇప్పటి హీరో, హీరోయిన్లు.. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే సైడ్ బిజినెస్‌లు చేస్తూ అందులో కూడా సక్సెస్ అవుతున్నారు. సినిమా కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం.. ఈ రోజు ఇండస్ట్రీలో డేట్స్ ఖాళీగానే లేని తారలే రేపు అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పటి తారలు తెలివిగా అడుగులు వేస్తున్నారు. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోడానికీ ఇష్టపడట్లేదు...
అయితే ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నా సినిమాలకు దూరంగా ఉంటానంటోంది వెంకటేష్ కూతురు ఆశ్రిత..బిజనెస్ రంగమైతే బెటరనుకుందో ఏమో బిస్కట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తోంది. ఈ రంగానికి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సులను కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఆశ్రిత తయారు చేసిన కుకీస్‌తో రామానాయుడు స్టూడియో ఘుమ ఘుమ లాడిపోతోందట. స్టూడియోలో స్టాల్స్ కూడా పెట్టేసింది. త్వరలోనే రీటైల్ అవుట్ లెట్స్ ద్వారా తన బిస్కెట్లను విక్రయించనుందట. భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సినిమాల్లో తండ్రి వెంకటేష్ సక్సెస్ అయ్యి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నట్లే ఆశ్రిత కూడా బిజనెస్ రంగంలో ఎదగాలని ఆశిద్దాం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







